Gold Rate Today: గత కొన్ని వారాలుగా దేశంలో బంగారం ధరలు ఎప్పడల్లా హెచ్చుతగ్గులు చవిచూస్తున్నాయి. ఏప్రిల్ 22న తులం బంగారం లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించినా, ఆ తర్వాత వరుసగా ధరలు దిగజారడం మొదలైంది. కేవలం 10 రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5,000 తగ్గింది. దీంతో వినియోగదారుల్లో కొంత ఊపిరిపీల్చుకోవడానికి అవకాశమొచ్చింది. అయితే ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం చుక్కలెక్కుతున్నాయి. ఇటీవల దేశంలోని ప్రముఖ నగరాల్లో వెండి ధరలు రూ.1,09,000 మార్కును దాటాయి.
వాణిజ్యపరంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాలతో ఆధారపడి మారుతూ ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం మే 4, 2025 న ఉదయం 6 గంటల వరకు ఈ ధరలు నమోదు అయ్యాయి.
నగరాల వారీగా బంగారం, వెండి ధరల గ్రిడ్ (04 మే 2025)
నగరం | 22 క్యారెట్ల బంగారం (10గ్రా) | 24 క్యారెట్ల బంగారం (10గ్రా) | వెండి ధర (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹87,550 | ₹95,510 | ₹1,09,900 |
విశాఖపట్నం | ₹87,550 | ₹95,510 | ₹1,09,000 |
విజయవాడ | ₹87,550 | ₹95,510 | ₹1,09,000 |
ఢిల్లీ | ₹87,700 | ₹95,660 | ₹98,000 |
ముంబై | ₹87,550 | ₹95,510 | ₹98,000 |
చెన్నై | ₹87,550 | ₹95,510 | ₹1,09,000 |
బెంగళూరు | ₹87,550 | ₹95,510 | ₹98,000 |
మదింపు:
ఈ ధరలు ప్రతిరోజూ మారుతున్న నేపథ్యంలో, కొనుగోలు చేయాలనుకునే వారు అధికారిక జ్యువెల్లరీ వెబ్‌సైట్లు లేదా స్థానిక గోల్డ్ డీలర్లను సంప్రదించి తాజా ధరలను తెలుసుకోవడం మంచిది. వెండి ధరలు ప్రస్తుతం గణనీయంగా పెరుగుతుండటంతో, పెట్టుబడి దృష్ట్యా ఇది కూడ ఓ అవకాశంగా మారవచ్చు.