Gold Rate Today: మే 7 (బుధవారం): నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు క్రమంగా పైకెగుస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
-
24 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ.9,847
-
22 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ.9,026
-
18 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ.7,385
వెండి ధరలు ఇలా ఉన్నాయి:
-
గ్రాముకు వెండి ధర: రూ.107.80
-
కిలో వెండి ధర: రూ.1,07,800
నగరాల వారీగా బంగారం, వెండి ధరలు – పూర్తి లిస్టు (10 గ్రాముల ధరలు):
నగరం | 22 క్యారెట్ల బంగారం | 24 క్యారెట్ల బంగారం | వెండి (1 కిలో) |
---|---|---|---|
చెన్నై | ₹90,260 | ₹98,470 | ₹1,07,800 |
ముంబై | ₹90,260 | ₹98,470 | ₹1,07,800 |
ఢిల్లీ | ₹90,410 | ₹98,620 | ₹1,07,800 |
కోల్‌కతా | ₹90,260 | ₹98,470 | ₹1,07,800 |
బెంగుళూరు | ₹90,260 | ₹98,470 | ₹1,07,800 |
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం:
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, దేశీయంగా బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు చేయడంతో దక్షిణాసియాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావం నేరుగా మార్కెట్లపై పడుతుందని, ముఖ్యంగా బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి ఇది లాభదాయకమవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.