gold rate: దేశీయంగా బంగారం ధరలు మళ్లీ చరిత్ర సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెరగడంతో, భారత మార్కెట్ లైవ్‌గా గోల్డ్ రేట్లు భారీ లాభాలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే తులం ధర రూ. లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో, పసిడి కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్న వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర *రూ. 98,350గా నమోదైంది. అంటే తులం బంగారం లక్ష రూపాయలు చేరేందుకు కేవలం **రూ. 1,650 మాత్రమే గ్యాప్* ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు ఈ వేగాన్ని కొనసాగిస్తే *రేపే లక్ష రూపాయల మార్క్‌ను తాకే అవకాశం ఉంది.*
అంతర్జాతీయంగా బంగారం ధర ఏకంగా $3,400 డాలర్ల మార్క్‌ను దాటింది . ఒక్కరోజులోనే *$80 డాలర్లకు పైగా పెరిగింది*, ఇది గత కొన్ని వారాల కాలంలోనే ఒక అతిపెద్ద దూకుడు. దీనివల్ల దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో తీవ్ర స్పందన కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 26 శాతం** పెరిగాయి. మూడున్నర నెలల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర **రూ. 20,000 వరకూ పెరిగింది.

