Gold Rate Hike: కాలజ్ఞాని పోతులూరి బ్రహ్మంగారు నాడు బంగారంపై చెప్పిన విషయాలు నిజమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాలు వాస్తవరూపం దాల్చగా, బంగారం విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాను రాను ఇత్తడి పుత్తడి (బంగారం) అవుతుంది.. అని ఆనాడే బ్రహంగారు కాలజ్జానంలో చెప్పారు. అంటే బంగారం విలువ విపరీతంగా పెరగడంతో దాని మెరుగులా ఉండే ఇత్తడితో ప్రజలు బంగారు ఆభరణాలుగా చేయించుకుంటారని, దాంతో ఆ ఇత్తడి విలువ పెరిగి పుత్తడిలా మారుతుందని ఆనాడే జోస్యం చెప్పారు.
Gold Rate Hike: ప్రస్తుతం బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గత ఏడాది నుంచి ఒక్క ఏడాదిలోపే సుమారు రూ.50 వేలకు పైగా తులం ధర పెరిగింది. ఇదే వేగంతో వచ్చే ఏడాది నాటికి మరింతగా ధరలు పెరిగి ఆకాశాన్నంటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది కొత్త రికార్డులు కూడా స్పృష్టించవచ్చని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) భావిస్తున్నది.
Gold Rate Hike: వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల స్థాయికి చేరవచ్చని డబ్ల్యూజీసీ సీఈవో డేవిడ్ టైట్ జోస్యం చెప్పారు. అంటే ఇప్పుడున్న ధరకు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రీషియస్ మెటల్ కాన్ఫరెన్స్‌లో కూడా ఇలాంటి కీలకాంశాలు చర్చకు వచ్చాయి. గత అక్టోబర్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,381 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు స్పృష్టించింది. తాజాగా 4,150 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది.

