Gold Price Today: దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతున్నది. గత కొన్నాళ్లుగా ఈ వేగం ఆగనంటున్నది. ఈ ఏడాది తులం బంగారం రేటు రూ.1 లక్ష దాటుందని ఈ ఏడాది ఆరంభంలోనే ఆర్థిక విశ్లేషకులు తేల్చి చెప్పారు. వారి అంచనా ప్రకారం ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. ఈ వేగాన్ని చూస్తే ఈ ఏడు తొలి త్రైమాసికంలోనే ఆ మార్కుకు చేరే అవకావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Gold Price Today: దేశంలో ఈ రోజు జనవరి 26న బంగారం ధర పెరగగా, వెండి రేట్లు కాస్త తగ్గాయి. శనివారం 25న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 82,700 ఉండగా, ఆదివారం నాటికి రూ.200 పెరిగి రూ.82,900కు చేరుకున్నది. కిలో వెండి ధర శనివారం 25న 93,500 ఉండగా, ఆదివారం 26నాటికి రూ.250 తగ్గి రూ.93,250కి చేరుకున్నది.
Gold Price Today: ఈ ధరలు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.82,900, కిలో వెండి ధర రూ.93,250గా ఉన్నాయి. విజయవాడలో బంగారం రూ.82,900, వెండి రూ.93,250, ప్రొద్దుటూరులో బంగారం రూ.82,900, కిలో వెండి రూ.93,250గా ఉన్నది. విశాఖపట్నంలో బంగారం రూ.82,900, కిలో వెండి రూ.93,250గా నమోదైంది.అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.75,550, విజయవాడలో 75,550, ఢిల్లీలో 75,700, ముంబైలో రూ.75,550గా నమోదైంది.
గమనిక : ఈ ధరల్లో అంతర్జాతీయ మార్కెట్లను బట్టి మారుతూ ఉండొచ్చు. గమనించగలరు.

