Gold Rate Today: బంగారం ధరలు మరోసారి తగ్గే దిశగా కదులుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా బంగారం విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. 2024లో ఇది 30 శాతం మేర లాభాలను నమోదు చేసింది. 2025లో ఇప్పటివరకు దాదాపు 20 శాతం పెరిగింది. అయితే, గత వారం నుండి బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
ఏప్రిల్ 10 ఉదయం వరకు తులం బంగారం ధర నిన్నటి ఉదయం రూ.89,720 నుంచి ఇప్పుడు రూ.90,450కి చేరుకుంది. అంటే తులానికి రూ.700కు పైగా పెరుగుదల కనబడింది. కానీ దీన్ని నిపుణులు తాత్కాలిక ఎత్తుగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం 10 గ్రాములకు రూ.55,000 వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, పెట్టుబడిదారులకు ఇది పెద్ద షాక్‌గా మారొచ్చు.
దేశ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (ఏప్రిల్ 10, ఉదయం 6 గంటలకు):
నగరం | 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల ధర (10 గ్రాములు) | వెండి ధర (1 కిలో) |
---|---|---|---|
ఢిల్లీ | ₹83,060 | ₹90,600 | ₹92,800 |
చెన్నై | ₹82,910 | ₹90,450 | ₹92,700 |
ముంబై | ₹82,910 | ₹90,450 | ₹92,900 |
హైదరాబాద్ | ₹82,910 | ₹90,450 | ₹92,850 |
విజయవాడ | ₹82,910 | ₹90,450 | ₹92,750 |
బెంగళూరు | ₹82,910 | ₹90,450 | ₹92,800 |
రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు?
ET వార్తా సంస్థ ప్రకారం, మార్నింగ్‌స్టార్ సంస్థ విశ్లేషకుడు జాన్ మిల్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు 38 శాతం వరకు పడిపోవచ్చు. ఇది నిజమైతే 10 గ్రాముల బంగారం ధర ₹55,000 వరకు చేరవచ్చని భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.