Gold: భారత్ లో చిన్న శుభకరమైన బంగారం కొనాలని చూస్తాం. ఇక పెళ్లిళ్లు పుట్టినరోజులు అంటే చెప్పాల్సిన విషయం ఏమి కాదు.. ఉన్నవాళ్లు కిలోలు కొంటే లేని వాళ్ళు గ్రామంలో కొంటారు. కానీ పసిడిని మాత్రం ఇంట్లోకి తెచ్చుకుంటారు. వారికి నచ్చిన వారికి బహుమతిగా ఇస్తారు. బంగారానికి భారీ డిమాండ్ పెరగడంతో ఆ డిమాండ్ కు తగ్గట్టు రేటు కూడా పెరుగుతుంది. సీజన్ కానప్పుడు బంగారం ధర పైపైకి వెళ్ళింది. అలాంటిది ఇంకా పెళ్లిళ్ల సీజన్ వస్తుంటే రేటు ఆకాశం అంటుంది. సగటున ఒక్క రోజుకు బంగారం ధర 50 రూపాయలు పెరుగుతూ వస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధర స్థిరంగానే ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర 80, 290గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఇలా ఉంది.24k 80,044గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తులం బంగారం ధర ఇలా ఉంది. 24k 80, 290గా ఉంది.
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా లో పరిశీలిస్తే..24k 80, 290గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24k 80, 290గా ఉంది.
భారత్‌లో బంగారం డిమాండ్:
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే, ఒకానోక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఇ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా, పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ప్రస్తుతం ఉన్న భౌతిక రూపంలోనే కొనేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఖాతా లోటు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా బంగారం దిగుమతులను తగ్గిచేందుకు ప్రయత్నించింది. గత ఏడాది బంగారం దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సుంకం పెంపును అమల్లోకి తీసుకొచ్చింది.