Gold Price Today: బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.
నేటి బంగారం ధరలు:
ఈరోజు (సెప్టెంబర్ 12) హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,499కి చేరింది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ. 10 తగ్గింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,01,290గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్, నిజామాబాద్, పొద్దుటూరులలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,10,650; 22 క్యారెట్ల బంగారం రూ. 1,01,440.
ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,10,500; 22 క్యారెట్ల బంగారం రూ. 1,01,290.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,10,720; 22 క్యారెట్ల బంగారం రూ. 1,01,490.
నేటి వెండి ధరలు:
బంగారం బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 1,39,900కి చేరింది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 1,29,800గా కొనసాగుతోంది. వెండి వినియోగం పెరగడం, పెట్టుబడిదారులకు సురక్షితమైనదిగా భావించడంతో వెండి ధరలు పెరుగుతున్నాయి.