Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు పండగ ముందే పండగ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్!

Gold Price Today: ఉగాది పండుగ ముంగిట బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది నిజంగా తీపి కబురు. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే తులం బంగారంపై 1,500 రూపాయల వరకు తగ్గగా, గత రెండు మూడు రోజుల్లో చూస్తే సుమారు 3,000 రూపాయల మేర ధర తగ్గింది. ఈ తగ్గుదల సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం వేచి చూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తోంది.

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,680 రూపాయలుగా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,290 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు ఉండగా, ఢిల్లీలో మాత్రం స్వల్ప మార్పుతో కొంచెం ఎక్కువగా ఉంది. అయితే చెన్నైలో మాత్రం ఇతర నగరాల కంటే ధర కాస్త ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. పండుగ పూట బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ఒక్క రోజులోనే కిలో వెండిపై 10,000 రూపాయలకు పైగా ధర తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 2,89,900 రూపాయల వద్ద ఉండగా, ఇతర నగరాల్లో ఇంకా తక్కువగా 2,79,800 రూపాయల వద్ద లభిస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న రేట్లు, దిగుమతి సుంకాలు మరియు పన్నుల ప్రభావం వల్ల ఈ ధరల్లో మార్పులు వస్తుంటాయి. మన దేశంలో బంగారం అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు కాబట్టి ధరలు తగ్గగానే ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *