Gold Price Today: బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఒక రకంగా ఊరట కలిగించే వార్తే. గత వారం రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు, ఈరోజు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లో నేటి ధరలు
మన భాగ్యనగరంలో తులం బంగారం ధరలను గమనిస్తే.. 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ. 1,59,280 వద్ద ఉంది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,46,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక తక్కువ బడ్జెట్‌లో దొరికే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,460 గా ఉంది. గతంలో తులం బంగారం ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు వెళ్తుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ధరలు కొంత దిగిరావడం విశేషం.
వెండి ధర పరిస్థితి
కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా నేడు నిలకడగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,75,000 వద్ద విక్రయించబడుతోంది. ఒక దశలో వెండి ధర 4 లక్షల రూపాయల మార్కును చేరుకుంటుందని అనిపించినా, గత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. వెండి ఆభరణాలు లేదా వెండి వస్తువులు కొనుగోలు చేసే వారికి ఈ స్థిరత్వం కాస్త ఊరటనిస్తోంది.
ఇతర నగరాల్లో ఎలా ఉందంటే..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, స్థానిక పన్నుల వల్ల స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,430 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ. 1,60,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, విజయవాడ నగరాల్లో మాత్రం హైదరాబాద్ ధరలే అమలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువలో మార్పుల బట్టి ఈ ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ (GST) మరియు మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని గుర్తుంచుకోండి.
