Gold Price Today

Gold Price Today: మళ్లీ సీన్ రివర్స్.. రాకెట్‌లా దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే..!

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు బుధవారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.1,51,000 మార్కును దాటేసి కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,970 పెరిగి, ప్రస్తుతం రూ.1,51,480 కి చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,800 పెరిగి, రూ.1,38,850 వద్ద కొనసాగుతోంది. పసిడితో పాటే వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర గరిష్టంగా రూ.2,64,900 వరకు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,850 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర సుమారు రూ.2,55,000 వద్ద ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,53,270 కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,630 ఉండగా, ముంబై మరియు బెంగళూరు నగరాల్లో హైదరాబాద్ ధరలకే బంగారం లభిస్తోంది. అయితే ప్రతి నగరంలోనూ ధరలు ఒకేలా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, రవాణా ఖర్చులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *