Goa Nightclub Fire:గోవా నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న రాత్రివేళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని 25 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో 22 మంది క్లబ్ సిబ్బంది ఉండగా, మరో ముగ్గురు పర్యాటకులు ఉన్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన క్లబ్ నిర్వాహకులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరూ విదేశాలకు పారిపోయారు. థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పరారయ్యారు. అయితే వారిద్దరి పాస్‌పోర్టును భారత్ రద్దు చేయడంతో అక్కడి పోలీసులకు చిక్కిపోయారు.
Goa Nightclub Fire:అయితే గోవా నైట్‌క్లబ్ ప్రమాదం అక్కడి సిలిండర్ పేలుడుతో సంభవించిందని అందరూ భావించారు. వాతావరణం కూడా అలాగే కనిపించింది. సిలిండర్ పేలుడుతోనే అగ్నిప్రమాదం మరింతగా విస్తరించింది. అయితే డ్యాన్స్ ఫ్లోర్‌పై పేల్చిన బాణసంచా కారణంగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. ఆ తర్వాత నిప్పురవ్వలతో సమీపంలో ఉన్న సిలిండర్ పేలుడుతో మరింతగా అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
Goa Nightclub Fire:ఈ భారీ ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు రక్షణగా ఉండాల్సిన ఆ క్లబ్ నిర్వాహకులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా తెల్లారేలోగా థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు ఫ్లైట్‌లో పరారయ్యారు. దీంతో భారత్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ రంగంలోకి దిగింది. వెంటనే సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా పాస్‌పోర్టులను సస్పెండ్ చేసింది. దీంతో థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం.. పాస్ పోర్టు రద్దయిన వారు తమ దేశంలో ఉండరాదన్న నిబంధనతో ఇక్కడి నైట్‌క్లబ్ నిర్వాహకులను థాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈ రోజే (డిసెంబర్ 12న) భారత్‌కు రప్పించే అవకాశం ఉన్నది.

