Glenn Maxwell: ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చాడు గ్లెన్ మాక్స్‌వెల్. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012 నుండి 2025 వరకు149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్ 33.81 సగటుతో 3వేల 990 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 36 ఏళ్ల మాక్స్‌వెల్ బౌలర్ గా ఆకట్టుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ గా 5.46 ఎకానమీ రేటుతో 77 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో మాక్స్‌వెల్ సభ్యుడిగా ఉన్నాడు. భారత్, శ్రీలంకలో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని మాక్స్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా కాలి గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌కు మాక్స్‌వెల్ దూరమయ్యాడు. ఇక తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాక్స్‌వెల్ మాట్లాడుతూ .. వన్డే క్రికెట్‌లో శారీరక శ్రమ, కాలి గాయంతో పాటు తన ఆటతీరుపై ప్రభావం చూపుతోందని, 2027 ప్రపంచ కప్ వరకు తాను కొనసాగలేనని మాక్స్‌వెల్ వివరించాడు.
