Bengaluru

Bengaluru: బెంగళూరులో కలకలం… సూట్ కేసులో మైనర్ బాలిక మృతదేహం

Bengaluru: బెంగళూరు నగర శివార్లలో బుధవారం అత్యంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. సుమారు పదేళ్ల వయసున్న ఒక బాలిక మృతదేహం సూట్‌కేసులో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అమానవీయ ఘటన బెంగళూరు వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే, అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఈ సూట్‌కేసును కొందరు బాటసారులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆ సూట్‌కేసును చూసి వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో, ఆ ప్రాంత పరిధిలోని సూర్యానగర్ పోలీస్ స్టేషన్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సూట్‌కేసును తెరిచి చూడగా, అందులో చిన్నారి మృతదేహం ఉండటంతో వారు నివ్వెరపోయారు.

బాలికను వేరొక చోట హత్య చేసి, ఆపై మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి, ప్రయాణిస్తున్న రైలు నుంచి ఇక్కడ విసిరేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bhadradri Kothagudem: కోడిపుంజు దొంగిలించాడ‌ని క‌రెంటు షాక్ ట్రీట్‌మెంట్‌.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పోలీసుల నిర్వాకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *