Test captaincy: భారత జట్టు జూన్‌లో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌కు జట్టును ఇంకా ప్రకటించలేదు. కానీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత టెస్ట్ జట్టు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభమైంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. కానీ ఎప్పుడూ గాయాల బారిన పడే బుమ్రా స్థానంలో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్ కెప్టెన్సీకి కొత్తగా మరోపేరును తెరపైకి తెచ్చాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యత ఇవ్వాలని అశ్విన్ డిమాండ్ చేశాడు. 25 ఏళ్ల గిల్‌పై అంత ఒత్తిడి తీసుకురావడం సరికాదు. అందువ, రవీంద్ర జడేజా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడని, అతనికి బాధ్యత అప్పగించాలని అశ్విన్ అన్నాడు. ‘జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు రవీంద్ర జడేజా. జడేజాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ ఇవ్వండి. అలాగే శుభ్‌మాన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతను అప్పగించండి. ప్రతి ఆటగాడికి భారత జట్టుకు కెప్టెన్ కావాలని కలలు కంటాయి. అటువంటి పరిస్థితిలో జడేజా ఈ పాత్రను సంతోషంగా తీసుకోవచ్చు. జడేజాకు కెప్టెన్సీ చేపట్టాలనే కోరిక లేదు. కానీ తనకు కెప్టెన్సీ అప్పగించడం వల్ల ఎలాంటి నష్టం జరగదని’’ అశ్విన్ అన్నాడు.
Also Read: IPL 2025: ముంబై కీలక నిర్ణయం.. జాక్స్ ప్లేస్‌లో బెయిర్ స్టో
జడేజాకు చాలా అనుభవం ఉంది.
Test captaincy: ఐసీసీ ఇటీవల వెల్లడించిన టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే జడేజా 2012 నుండి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. తన 13ఏళ్ల కెరీర్‌లో అతను బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఒంటి చేత్తో అనేక మ్యాచ్‌లను గెలిపించాడు. అందువల్ల జడేజాకు ఉన్న అనుభవం ఆధారంగా భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ ఇవ్వాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కానీ బీసీసీఐ జడేజాను కెప్టెన్‌గా నియమించే అవకాశం లేదు. ఎందుకంటే బీసీసీఐ యువ ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.