Murder Mystery: యూపీలో ఘజియాబాద్ జరిగిన ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత చేసుకున్న ఘటన ఇండియా మొత్తం సంచలనంగా సష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో విషయం బయటికి వస్తూ పోలీసులను షాక్ కి గురిచేస్తుంది.. మూడు గదులు ఉన్న ఒక్క రూమ్ లోనే అందరూ పండుకోవడం. తండ్రి చేతన్ కుమార్ కు ముగ్గురు భార్యలు ఉన్నటు తేలింది.. అతను గతంలో ఇంకో ఆత్మహత్య కేసులో నిందితుడు గా ఉన్నటు రికార్డులు బయటపడ్డాయి. చనిపోయిన ముగ్గురు కూతురుతో ఇద్దరు మొదటి ఇద్దరి భార్య పిల్లలుగా సమాచారం. మూడో భార్య వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
దర్యాప్తులో తెలిసినా విషయాలు..
ముందుగా ముగ్గురు భార్యల విషయానికి వస్తే.. 2010లో సుజాతతో తర్వాత 2013లో హీనాని పెళ్లి చేసుకున్నాడు. 2018 ప్రస్తుతం ఉన్న మూడో భార్య టీనా ని పెళ్లిచేసుకున్నాడు. మూడు పెళ్లిలా గురించి అడగగా మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటు తెలిపాడు కానీ ఇక్కడే ఒక్క అనుమానం వచ్చింది పోలీసులకు ఎందుకంటే పెద్ద కూతురు వయస్సు 16 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. ఇద్దరు భార్యలకు రాయడం,చదవడం రాకపోవడం వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్స్ దొరకడం కష్టంగా మారింది పోలీసులకు. గతంలో చేతన్ కుమార్ క్రెడిట్ కార్డు సర్వీస్ చేస్తున్న సమయంలో 2018 లో టీనా అతని దగ్గర పనిచేస్తుండేది అదే సమయంలో ఇద్దరి మధ్యలో పరిచేయం కాస్త ప్రేమగా మరి పెళ్లి చేసుకున్నాటు చెప్పాడు. దీనిపైనా కూడా పోలీసులకు అనుమానం వచ్చింది ఎందుకంటే గతంలో టీనా తన మరదలు అని చెప్పి ఇపుడు మాటమార్చి భార్య అని చెప్పడమే ఇందుకు కారణం.
ఇంట్లో మూడు గదులు ఉన్న అందరూ ఒక్క గదిలోనే పండుకునేవారు అని తెలుస్తుంది. ఎందుకు అనే సమాధానం దొరకలేదు. అందరూ ఒక్కే గదిలో ఉన్నపుడు ఒక్కేసారి ముగ్గురు పిల్లలు బయటికి వెళ్లి 9 ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటే తెలియలేదా. వెళ్లినపుడు ఎవరు గమనించలేదా లేదా కావాలనే వదిలేశారా? అసలు ఇది ఆత్మహత్య లేదా హత్య అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇంతకు ముందు పిల్లల దగ్గర మూడు రెండు ఫోన్లు ఉండేవి కానీ వాటిని త్రండ్రి చేతన్ కుమార్ అప్పులు కట్టడానికి అమ్మేసినటు సమాచారం. మొదటి ఫోన్ 6 నెలల ముందు ఇంకోటి గతానికి 15 రోజుల ముందు అనేశాడు చేతన్ కుమార్. ఆత్మహత్య కి గల కారణాల కనుకోవడానికి పోలీసులు ఆ రెండు మొబైల్ IMEI నంబర్స్ తో ట్రేస్ చేస్తున్నారు. ఫోన్లు దొరికిన తర్వాత బ్యాక్ అప్ చేసిన అందులో ఏదైనా సమాచారం దొరుకుతుంది అని పోలీసులు అనుకుంటున్నారు.
నిజంగానే ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలై ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్య చేశారా? ఒకవేల ఇదే నిజం అయితే ఎందుకు చంప్పారు అనేది తెలియలిసి ఉంది దీనికి కాలమే సమాధానం చెపుతుంది.
