Jayakrishna

Jayakrishn: ఘట్టమనేని జయకృష్ణ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం!

Jayakrishn: సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ లాక్ అయ్యాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Keerthy Suresh: AI దుర్వినియోగంపై కీర్తి సురేష్ ఆందోళన!

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. తెలుగు, తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్, డార్లింగ్, ఆకాశం నీ హద్దురా వంటి ఆల్బమ్‌లతో హిట్ ట్రాక్ రికార్డు ఉన్న జీవీ ప్రకాష్ ఈ కాంబినేషన్‌కు మరింత బలం చేకూర్చనున్నారు. రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *