Ratnavelu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా అద్భుతంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరణ్ నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ పూర్తిగా కొత్తగా ఉంటాయని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sukumar: సైమా అవార్డ్స్ లో సత్తా చాటిన పుష్ప 2.. పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ క్రికెటర్‌గా కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో ఆయన రగ్డ్ లుక్, నోస్ రింగ్, బీడీ తాగుతూ కనిపించే తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మైసూర్‌లో 1000 మంది డాన్సర్లతో షూట్ చేసిన ఇంట్రో సాంగ్ హైలైట్‌గా నిలవనుంది. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో చరణ్ నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ పూర్తిగా కొత్తగా ఉంటాయని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.