Germany: సాంకేతికత ఏటేటా కొత్త పుంతలు తొక్కుతూ మరో ముందడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి మితిమీరి పోయింది. ఈ నేపథ్యంలో దానికి విరుగుడుగా కొందరు శాస్త్రవేత్తలు ఆలోచించారు. బుల్లెట్, కత్తి లాంటి ఆయుధాలను అడ్డుకుని, శరీరంలోకి దిగబడకుండా సరికొత్త వస్త్రాన్ని కనుగొన్నారు. ఇది విస్తరిస్తే ఎందరికో రక్షణ కవచంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
Germany: జర్మనీలోని ఫ్రాన్హాఫెర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు బుల్లెట్ ఫ్రూప్ కవచంలా మారే ఆ స్మార్ట్ వస్త్రాన్ని కొనుగొన్నారు. కంటికి కనిపించని ఎస్టీఎఫ్ నానో పార్టికల్స్‌ను వాడి ఆ వస్త్రాన్ని రూపొందించినట్టు తెలిపారు. బుల్లెట్, కత్తి వంటివి ఏవైనా మనవైపు వేగంగా దూసుకొస్తుంటే ఆ వేగాన్ని గుర్తించిన కణాలు ఒకదానితో ఒకటి కలిసి బలమైన కవచంలా మారుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Germany: ఈ నూతన వస్త్రంతో పిల్లల యూనిఫాంలు, మిలిటరీ రంగంలో పనిచేసే వారికి రక్షణ దుస్తులు రూపొందించాలని ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇది విస్తరిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని, ఒక విధంగా అరాచక వాదులను ఈ విధంగా ఎదుర్కోవచ్చని పలువురు భావిస్తున్నారు.

