Genelia

Genelia: కారు ప్రమాదం నుంచి బయటపడిన జెనీలియా!

Genelia: ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. తన ఇద్దరు కుమారులతో బయటకు వెళ్లిన జెనీలియా కారులోకి ఎక్కుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆమె సరిగ్గా కూర్చోకముందే డ్రైవర్ అనుకోకుండా కారును ముందుకు కదిపాడు. కారు వేగం తీసి ఉంటే, జెనీలియా కిందపడి తీవ్ర ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ, ఆమె సమయస్ఫూర్తితో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె, 2020లో ‘ఇట్స్ మై లైఫ్’తో రీఎంట్రీ ఇచ్చారు. 2022లో రితేష్ దర్శకత్వంలో ‘వేద్’లో నటించి, నిర్మాణ రంగంలోనూ సత్తా చాటారు. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న జెనీలియా ఈ ఘటనతో అభిమానులను ఉలిక్కిపాటు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jogi Chapter Close: జోగి పాపాలకు కొడుకు భవిష్యత్తు ఖతమ్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *