Gautham Ghattamaneni: మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ప్రస్తుతం యుఎస్ లో చదువుతున్నాడు. తాజాగా గౌతమ్ ఉన్న ఓ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా టిక్ టాక్ చేసే వ్యక్తులు వీధుల్లో వెళుతున్న వారితో ఇంటరాక్ట్ అవుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. అలా ఓ టిక్ టాకర్ చేసిన వీడియోలో మహేశ్ కుమారుడు గౌతమ్ ఉండటంతో ఆ వీడియో ట్రెండింగ్ లో ఉంది. గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ లోని వీధుల్లో నడుకుంటూ వెళుతున్నపుడు ఓ టిక్ టాకర్ వారి వద్దకు వెళ్లి బాలీవుడ్ మ్యూజిక్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ సరైన సమాధానాలు చెబితే 100 డాలర్లు ఇస్తానంటాడు. అయితే అతనడిగిన అన్నిప్రశ్నలకు గౌతమ్ అతని ఫ్రెండ్స్ ఆన్సర్స్ చెప్పి బహుమతిగా 100 డాలర్స్ గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని ఏం చేస్తారని ఆ టిక్ టాకర్ అడిగినపుడు గౌతమ్ ఫ్రెండ్స్ పానీ పూరి తింటాం అని బదులివ్వటం విశేషం. ఇక ఆ టిక్ టాకర్ ఇన్ స్టాలో పోసిన వీడియోపై సితార ‘నా సోదరుడు ఇక్కడ ఏమి చేస్తున్నాడు’ అని వ్యాఖ్యానించగా గౌతమ్ ‘నిజమే… నేను ఏమీ చేయలేదు’ అని బదులిచ్చాడు.
View this post on Instagram