Gautam Gambhir:

Gautam Gambhir: గౌత‌మ్ గంభీర్‌ను చంపుతాన‌న్న ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, భార‌త జ‌ట్టు మాజీ క్రికెటర్, లోక్‌సభ మాజీ సభ్యుడు గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరింపు మెయిల్స్ పంపిన వ్య‌క్తిని పోలీసులు గుర్తించారు. అత‌ను ఇంజినీరింగ్ క‌ళాశాల విద్యార్థిగా గుర్తించారు. గుజ‌రాత్‌కు చెందిన జిగ్నేశ్ సిన్హ్ ప‌ర్మార్ (21)గా గుర్తించిన పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు.

Gautam Gambhir: ఐసిస్ క‌శ్మీర్ అనే పేరున ఉన్న‌ మెయిల్ ఐడీపై ఐ కిల్ యూ అంటూ గౌత‌మ్ గంభీర్‌కు జిగ్నేశ్ సిన్హ్ ప‌ర్మార్ బెదిరింపు మెయిల్స్ చేశాడు. అయితే జిగ్నేశ్ సిన్హ్ ప‌ర్మార్ మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని పోలీసుల‌తో అత‌ని కుటుంబ స‌భ్యులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కు భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని కోరుతూ గౌతమ్ గంభీర్ పోలీసుల‌ను కోరారు.

Gautam Gambhir: బెదిరింపు మెయిల్ వ‌చ్చిన నేప‌థ్యంలో గౌతమ్ గంభీర్ ఇంటి వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు. ఆయ‌న కుటుంబానికి కూడా భద్ర‌త‌ను పెంచారు. ఇటు రాజ‌కీయ రంగంలో, అటు క్రికెట్ రంగంలో బాధ్య‌త‌ల్లో ఉన్న గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ రావ‌డంపై ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *