Ganta srinivas Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచాయి. ఆయన మాట్లాడుతూ, “తాము తలుచుకుంటే వైసీపీ నేతలు గేటు కూడా దాటలేరు” అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనల్లో ఆంక్షలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు.
గౌరవం ఇస్తేనే జగన్ పర్యటనలకు అనుమతిస్తుంటామని గంటా అన్నారు. మిథున్ రెడ్డి అరెస్టుపై జరుగుతున్న విమర్శలు, ముఖ్యంగా “పెద్దిరెడ్డి మీద కక్షతోనే అరెస్ట్ చేశారు” అనే ఆరోపణలపై మండిపడ్డారు. “మిథున్‌పై ఏదైనా చేయాలనుకున్నా, జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసేవారు. ఇప్పుడు దుష్ప్రచారం చేయడం తగదు” అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు చూస్తే, ఏపీ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ భరితంగా మారే అవకాశం కనిపిస్తోంది.

