Gang Rape:మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మైనర్ బాలికను ఓ ఐదుగురు బాలురు మూకుమ్మడి లైంగికదాడికి పాల్పడ్డారు. వారిలో నలుగురు బాలురు 9 ఏండ్లలోపు ఉన్నవారే కావడం గమనార్హం. సభ్య సమాజం తలవంచుకునేలా చేసిన ఈ ఘటన.. మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
Gang Rape:జడ్చర్ల మున్సిపాలిటీలోని ఓ కాలనీకి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. ఆ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తండ్రి పనిపై మూడు రోజుల క్రితం బయటకు వెళ్లగా, అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కూతురుకు వైద్యం చేయించేందుకు అని ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది.
Gang Rape:అదే సమయంలో చిన్న కూతురు ఇంటికి వచ్చింది. ఈ సమయంలో ఎవరూ లేరని భావించిన స్థానికులైన బాలురు ఆ మైనర్ బాలికపై ఏకంగా సామూహిక లైంగికదాడి పాల్పడ్డారు. వారిలో 4, 5 తరగతులు చదువుతున్న నలుగురు బాలురు ఉండగా, ఆ బాలిక సమీప బంధువైన ఇంటర్ చదివే (16) బాలుడు కూడా ఉన్నాడు. వీరంతా మూకుమ్మడిగా లైంగికదాడికి పాల్పడ్డారు.
Gang Rape:మూడు రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న బాలికను ఆమె తల్లిదండ్రులు బుధవారం ఆసుపత్రికి తరలించారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని అక్కడి వైద్యులు తేల్చారు. బాలిక తండ్రుల ఫిర్యాదు మేరకు, అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లపై పోలీసులు పోక్సో, గ్యాంగ్ రేప్ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.