Game Changer:

Game Changer: గేమ్‌చేంజ‌ర్ ఈవెంట్ నుంచి వెళ్తుండ‌గా ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం.. ప‌వ‌న్‌, దిల్ రాజు ఆర్థిక‌సాయం

Game Changer: రాజ‌మండ్రిలో జ‌రిగిన గేమ్‌చేంజ‌ర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి ఇండ్ల వెళ్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, గేమ్‌చేంజ‌ర్ సినిమా నిర్మాత దిల్ రాజు మృతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు. మృతుల‌కు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.

Game Changer: రాజ‌మండ్రిలో జ‌రిగిన గేమ్‌చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ఏడీబీ రోడ్డులో బైక్‌పై వెళ్తుండ‌గా, వ్యాన్ ఢీకొని కాకినాడ జిల్లా గైగోలుపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆర‌వ మ‌ణికంఠ‌, తోకాడ చ‌ర‌ణ్‌లు ఈ ప్ర‌మాదంలో మృతిచెందారు. ఏడీబీ రోడ్డు మ‌ర‌మ్మ‌తులో ఉన్న స‌మ‌యంలోనే వీరు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ణికంఠ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా, చ‌ర‌ణ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Game Changer: మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ మృతికి ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఈ రోడ్డు మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గేమ్‌చేంజ‌ర్ ఈవెంట్‌లో తాను ఒక‌టికి ప‌దిసార్లు క్షేమంగా వెళ్లండి అంటూ ప్రాధేయ‌ప‌డ్డాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తుచేశారు. అయినా జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌న త‌న‌ను బాధించింద‌ని తెలిపారు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు.

Game Changer: గేమ్‌చేంజ‌ర్ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా యువ‌కుల మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు మృతులైన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Stray Dogs: వీధి కుక్కలా దాడి.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు వేసిన వైద్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *