Game Changer on Cable TV: గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ కుట్ర జరుగుతోందనే విషయం మరోసారి స్పష్టం అయింది. సినిమా విడుదలకు ముందు నుంచే ప్రారంభమైన నెగెటివ్ ట్రోలింగ్.. సినిమా రిలీజ్ అయిన తరువాత మరింత పెరిగిపోయింది. ఏకంగా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా స్క్రీన్ మీద పడగానే.. చెత్త సినిమా అంటూ రివ్యూలు.. రేటింగులు ఊదరగొట్టేశారు. మూవీపై పగబట్టినట్టుగా ట్రోలింగ్స్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ నెట్లో దర్శనం ఇచ్చేసింది. దీంతో సినిమాపై ఎదో కుట్ర జరుగుతోంది అనే అనుమానాలు అభిమానుల్లో బలంగా వచ్చాయి.
Game Changer on Cable TV: సినిమా విడుదలైన తరువాత అంత నెగెటివ్ ట్రోలింగ్ లోనూ సినిమా చూసిన అసలైన ఆడియన్స్ తీసిపారేయాల్సిన సినిమా కాదనీ.. సినిమాలో మంచి మెసేజ్ ఉందనీ.. అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తోనే ఉండవు అని చెబుతూ వచ్చారు. కొందరు స్వచ్చందంగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ విషయమై పాజిటివ్ గా కామెంట్స్ ఇస్తూ వచ్చారు. దీంతో కొద్దిగా సినిమా పై సానుకూల పరిస్థితి వచ్చింది.
Game Changer on Cable TV: సంక్రాంతి.. ఈ పండుగకు వచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ అయినా కూడా అంటే అందరూ కచ్చితంగా ఇది చెత్త సినిమా అని చెప్పినా కూడా సంక్రాంతి తో పాటు తరువాత మరో పదిరోజులు కొద్దో గొప్పో కలెక్షన్లను కూడబెట్టుకుంటుంది. అయితే, గేమ్ చెంజర్ సినిమాకి క్రమేపీ పాజిటివిటీ పెరుగుతుండడంతో ఈసారి మరింత పెద్ద కుట్ర చేశారు. ఏకంగా సినిమా హెచ్ డి ప్రింట్ ను సంక్రాతి సందర్భంగా కేబుల టీవీలో వేసేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు అవాక్కయ్యారు. ఏంట్రా బాబూ మీకింత పగ అంటూ వాపోతున్నారు అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా కేబుల్ టీవీలో వాక్కుచేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపించాయి. అందులో ఒకటి ఈ క్రింద చూడవచ్చు.
Yesterday, ‘Ap Local TV’, a local cable network, streamed a pirated HD print of #GameChanger.
And no action has been taken so far.
There were so many conspiracies and propaganda by a section to kill the film. pic.twitter.com/3K1RWDWMPP
— Fukkard (@Fukkard) January 15, 2025
Game Changer on Cable TV: మొత్తంగా చూసుకుంటే రామ్ చరణ్ సినిమాను కావాలనే టార్గెట్ చేశారనే విషయం స్పష్టం అవుతుంది. ఈ సైకోలు ఎవరో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని రామ్ చరణ్ అభిమానులు కోరుతున్నారు. నటనలో రామ్ చరణ్ ని ఓడించడం చేతకాని వారు.. గ్లోబల్ స్టార్ గా ఆయన ఎదుగుదలపై అసహనంతో ఇలా రెచ్చిపోతున్నారని రామ్ చరణ్ అభిమానులు అంటున్నారు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకొని.. ఎవరినీ పల్లెత్తు మాట అనని రామ్ చరణ్ వంటి వారి విషయంలో ఇలా జరుగుతుండడం పట్ల సాధారణ ప్రేక్షకుల్లోనూ బాధ వ్యక్తం అవుతోంది.

