Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పొలిటీషియన్ రోల్‌లో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో అచ్చమైన పొలిటీషియన్‌తోనే స్క్రిప్ట్ రాయించారు.అందునా రామ్‌చరణ్ డైలాగ్‌లు ప్రత్యేకంగా రాయించారు.మదురైకు చెందిన ఎంపీ ఎస్. వెంకటేశన్ చేత పొలిటికల్ డైలాగ్స్ రాయించారు.ఎస్.వెంకటేశన్ కేవలం రాజకీయ నాయకుడే కాదు. పేరు మోసిన రచయిత కూడా..
Game Changer: కమ్యునిస్టు పార్టీ నాయకుడిగా ఆప్రాంతంలో బాగా పాపులర్ అయ్యారు.ఆయన పుస్తకాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సాహితీ వేత్త.తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్, యాక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు.సీపీఎం పార్టీకి చెందిన సెమ్మలన్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు.అతని తొలి నవల కావల్ కొట్టంకు సాహిత్య అవార్డు అందుకున్నారు.ఈ నవల ఆధారంగా అరావన్ సినిమా రూపొందింది.రాజకీయ నాయకుల సినిమాకు డైలాగ్‌లు రాయడం, కథను అందించడం దక్షిణాదిన కొత్తేం కాదు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్..నోటిసులు జారీ చేసిన UP కోర్ట్
Game Changer: గతంలో కరుణానిధి, అన్నాదురైలు సినిమాలకు డైలాగ్స్ రాశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్ ఉద్యమ సందర్భంగా వచ్చిన జై బోలో తెలంగాణకు పాట రాశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్నారు. కానీ ఎంపీగా సినిమాలో పొలిటికల్ క్యారెక్టర్‌కు డైలాగ్స్ రాసిన రికార్డు మాత్రం వెంకటేశన్‌కే దక్కుతుంది.గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్, వెంకటేశన్ ప్రముఖ నవల వీర యుగ నాయగన్ వేళ్ కాపీరైట్స్ తీసుకున్నారు.
Game Changer: ఈ నవల ఆధారంగా తదుపరి సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యారు. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ రాజకీయ నాయకుని పాత్రకు వెంకటేశన్ అనుభవం,ఆలోచనలు పనికొస్తాయని శంకర్ భావించారు. వెంటనే వెంకటేశన్ కూడా రాయడానికి ఒప్పుకున్నారు. వెంకటేశన్ వచ్చిన తరువాత గేమ్ ఛేంజర్‌కు అంచనాలు భారీగా పెరిగాయి.కథలో కూడా ఆయన సూచనల మేరకు చిన్న చిన్న మార్పులు చేశారని తెలుస్తోంది. రామ్‌చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కారెక్టర్ వెంకటేశన్ సూచనలతో మరింత సహజంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో రామ్‌చరణ్ పొలిటీషియన్ పాత్ర గేమ్‌ఛేంజర్ అవుందన్న టాక్ వినిపిస్తోంది.

