Vamika Gabbi: సుధీర్ బాబు భలే మంచి రోజుతో టాలీవుడ్ కి పరిచయం అయింది వామికా గబ్బి. ఆ తరువాత చాలా కాలం దాకా ఆఫర్లు లేక స్ట్రగుల్ అయ్యింది. ఇప్పుడు ఆమె లైనప్స్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్టును మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఒకటి కాదు ఐదు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో ఆఫర్స్ కొల్లగొడుతుంది. ప్రజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తోన్న భూల్ చుక్ మాఫ్‌లో నటిస్తోంది అమ్మడు. ఇదే కాదు దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్‌లో కీ రోల్ ప్లేచేస్తోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బీ.
Also Read: Dhanush: హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ధనుష్!
తెలుగులో పదేళ్ల తర్వాత అడివిశేష్ క్రేజీయెస్ట్ మూవీ గూఢచారీ2లో కమిటైంది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళంలో జీని అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతుంది. మలయాళంలో టికీ టాకాతో పాటు రణబీర్ అప్ కమింగ్ ప్రాజెక్టులో కూడా వామిక పేరు వినపడుతుంది.
