Gaaja: గాజా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా దాడుల్లో మరో 25 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు ప్యాలస్టినియన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుఝామున జరిపిన దాడులు తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, హమాస్ మిలిటెంట్‌లు లుక్కున్న ప్రాంతాలపై టార్గెట్ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఈ దాడుల్లో పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గత నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో వేలాది మంది మృతి చెందగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మానవతా సహాయం అంతరించిపోతున్న నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి.
ఇజ్రాయెల్ దాడుల తీవ్రత నిత్యం పెరుగుతుండటంతో, గాజా ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.