G20 Summit: బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో మంగళవారం జీ20 సదస్సు మూడో సెషన్ ముగిసింది. ఇందులో ‘సుస్థిర అభివృద్ధి, మెరుగైన ఇంధన ఎంపికలు’ అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు చర్చించారు.
అంతకుముందు సోమవారం, G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులు ‘ఆకలి -పేదరికానికి వ్యతిరేకంగా సంఘీభావం’, ‘ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడం’ గురించి చర్చించారు.
G20 Summit: మూడో సెషన్ ముగిసిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా గత సంవత్సరం న్యూఢిల్లీలో G20 విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు.