Kingston: హీరో గానూ, స్టార్ మ్యూజిక్ కంపోజర్ గానూ జీవీ ప్రకాష్ కుమార్ దూసుకుపోతున్నాడనే చెప్పాలి. అతను హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్స్టన్’ సినిమా తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాని రూపొందించాయి. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే మార్చ్ 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
