Mrs Telangana 2024: జీ మీడియా ఎంటర్ టైనర్ మెంట్స్ సంస్థ ‘మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ’ అందాల పోటీని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ సీఈవో కిరణ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను నటీమణులు ఇంద్రజ, రాశి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ ప్రియ కసబా, నటి సోని చరిష్ట, సీరియల్ ఆర్టిస్ట్ మహతి , యాంకర్ హాసిని తదితరులు పాల్గొన్నారు . ఈ నెల 14 నుండి 21 వరకూ ఈవెంట్ ఆడిషన్స్ జరుగుతాయని, గ్రాండ్ ఫైనల్ ను ఇదే నెల 28న నిర్వహించబోతున్నామని తెలిపారు.
