Bhartha Mahashayulaku Vignapthi

Bhartha Mahashayulaku Vignapthi: సంక్రాంతికి ముందే ఫన్ ట్రీట్: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రిలీజ్

Bhartha Mahashayulaku Vignapthi:  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. యూత్ & ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ కంటెంట్ తో వస్తోంది. రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్ తో అభిమానులను ఆకట్టుకున్నారు.

Also Read: Bigg Boss 9 Telugu: కోటికి పైనే ఇంటికి తీసుకొని వెళ్లనున్న బిగ్ బాస్ విన్నర్?

యువ దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ ఆద్యంతం ఫన్ తో నిండి ఉంది. సంక్రాంతి పండుగను ముందుగానే తెచ్చినట్టు కట్ చేసిన ఈ టీజర్ లో రవితేజ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలుస్తోంది. వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్ లు తమ కామెడీతో నవ్వులు పంచనున్నారు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్లో వీళ్ళ గ్లామర్ ట్రీట్ మాములుగా లేదనే చెప్పాలి. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. టీజర్ తోనే ఆడియెన్స్ ను ఆకర్షించేలా చేశారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *