Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడటంతో అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో రైల్వే ట్రాక్‌పై వరద నీరు నిల్వ ఉండడంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హన్మకొండలో రోడ్లపై భారీగా నీరు చేరి, అశోక జంక్షన్ నుంచి కాలేజీ జంక్షన్ వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ నమోదైంది. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

