Hyderabad: తెలంగాణలో ఎముకలు కోరికే చలి వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలపై పంజా విసిరింది. సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలితో ఉదయం 9 గంటలు దాటిననప్పటికీ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాలైతే మంచు దుప్పటి కప్పుకున్నాయ్. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బేల అనే ప్రాంతంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.7 డిగ్రీల టెంపరేచర్ చూడొచ్చు.
అలాగే నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీలు.. సంగారెడ్డి జిల్లాలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 10-17 డిగ్రీల మధ్యనే టెంపరేచర్ రిజిస్టర్ అవుతోంది.మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 నుంచి 17 డిగ్రీల మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు మేర పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.

