Nara Lokesh: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పలువురు ఉత్సవ నిర్వాహకులు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని చేసిన విజ్ఞప్తికి లోకేశ్ వెంటనే స్పందించి సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించనుండగా, పండుగ కాలంలో మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి దాదాపు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అయితే భక్తుల సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ ఖర్చును భరించేందుకు సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: Atchannaidu: ఏపీలో రైతులకు ఎరువుల కొరత ఉండదు: మంత్రి అచ్చెన్నాయుడు
ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక, రాబోయే విజయదశమి సందర్భంగా ఏర్పాటుచేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు గారు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించాను. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్… pic.twitter.com/pSKvIxGcZ0
— Lokesh Nara (@naralokesh) August 25, 2025