Free Coaching: ఉద్యోగ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వడంతోపాటు నెలనెలా స్టైపెండ్ ఇచ్చేందుకు బీసీ స్టడీ సర్కిళ్లు అవకాశం కల్పించనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో టీజీపీఎస్సీ, ఎస్సెస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ ఇతర పోటీ పరీక్ష కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు.
Free Coaching: డిగ్రీ మార్కుల ఆధారంగా నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తారు. రిజర్వేషన్లనూ ప్రామాణికంగా తీసుకుంటారు. ఆగస్టు నెల 11 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలనెలా రూ.1000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఈ శిక్షణ 5 నెలల పాటు ఉంటుందని తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డు (టీజీబీసీ) అధికారులు తెలిపారు.