AP SSC Exams 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఇంగ్లిష్ మీడియం ఎన్‌సీఆర్‌టీ సిలబస్‌తో నిర్వహించబడుతాయి. వచ్చే నెల ఒకటో తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయి.
ఉచిత బస్సు సౌకర్యం
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా హాల్ టికెట్ ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం 6,49,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్
టైం టేబుల్ మరియు హాల్ టికెట్లు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల టైం టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కూడా అక్కడే అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌లో స్క్రోల్ డౌన్ చేస్తే ‘SSC మార్చి 2025 టైం టేబుల్’ అనే లింకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పిడిఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల కేంద్రాల ఏర్పాట్లు
ఈ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 3,450 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 163 అత్యంత సున్నితమైన ఎగ్జామ్ సెంటర్లుగా గుర్తించి అక్కడ సీసీటీవీ పర్యవేక్షణను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు ఎదురైతే 0866-2974540 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని మరియు పరీక్ష నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.