Free Bus Scheme: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ రెండు పథకాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఉచిత బస్సు పథకం పేరు – మహా లక్ష్మి. 2023 డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు దీనికి అర్హులు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో వర్తిస్తుంది.
సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, వజ్ర, వెన్నెల, ఇతర ఏసీ బస్సుల్లో ఈ పధకం వర్తించదు. రాష్ట్రం లోపల ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర బస్సుల్లో రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం పేరు స్త్రీ శక్తి. 2025 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు దీనికి అర్హులు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ బస్సులలో వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు (అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ) ఈ పధకం వర్తించదు. రాష్ట్రం లోపల ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రం చూపిస్తే కండక్టర్ ‘జీరో ఫేర్ టికెట్’ జారీ చేస్తారు.