Fraud Case: ప్రేమ పేరుతో ఎందరో యువతులను నయవంచకులు మోసగిస్తూనే ఉన్నారు. కహనీలు చెప్పి కామం తీర్చుకున్నాక వదిలేసి ఎందరో యువతులను నడిబజారులో వదిలేస్తున్న ప్రబుద్ధులను మనం రోజూ చూస్తున్నాం. ఇదీ అలాంటి కోవకు చెందినదే. యువతిని నమ్మించి ఓ గుడికి తీసుకెళ్లిన ఆ ప్రబుద్ధుడు నుదుటన సింధూరం అద్ది పెళ్లి అయిందని నమ్మించి లైంగికవాంఛలు తీర్చుకొని మోసగించాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం ఆ యువతి వంతయింది.
Fraud Case: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన 26 ఏండ్ల యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఓ క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది. ఇద్దరూ ఒకే హాస్టల్‌లో ఉండేవారు. మంచిర్యాల యువకుడు తరచూ ఆ యువతితో మాటలు కలిపేవాడు. కానీ ఆమె లైట్ తీసుకున్నది.
Fraud Case: ఓ రోజు ఆ యువతి తండ్రికి గుండెపోటు వచ్చిందని ఒడిశాలోని సొంతూరుకు వెళ్లింది. ఇదే సమయం అనుకున్నాడో ఏమో కానీ, మంచిర్యాల యువకుడు తనలోని నటనకు తెరలేపాడు. సానుభూతిని చూపి బుట్టలేసుకోవాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్టుగానే ఒడిశాలో ఉన్న ఆ యువతికి తరచూ ఫోన్ చేసేవాడు. ఆమె తండ్రి యోగక్షేమాలు అడిగేవాడు. ఆమె బాగోగుల గురించి అడుగుతూ ఆమె పట్ల శ్రద్ధ చూపినట్టు రక్తికట్టించాడు. ఇది వారిద్దరి మధ్య స్నేహంగా మారింది.
Fraud Case: ఒడిశా బెంగళూరు వచ్చాక ఇద్దరి స్నేహం మరింతగా పెరిగింది. మంచిర్యాల యువకుడు, ఒడిశా యువతి మధ్య ఉన్న స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ సమయంలోనే ఇద్దరూ కలిసి కేరళ టూర్ వెళ్లారు. అక్కడే ఓ హోటల్‌లో ఉన్నప్పుడు ఆ యువతి నుదుటన సింధూరం పెట్టి పెళ్లి అయిందని ఆ యువతిని నమ్మించాడు. 2003లో ఇద్దరూ షిరిడీకి వెళ్లారు. ఆ సమయంలో ఆ యువకుడు తన తల్లిదండ్రులను ఆ యువతికి పరిచయం చేశాడు. దీంతో అతనిపై ఆ యువతికి మరింత నమ్మకం ఏర్పడింది.
Fraud Case: ఈ లోగా 2004లో ఇద్దరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. భార్యాభర్తలమని చెప్పేశారు. తనకు ఇదే లోకం అనుకొన్న ఆ ఒడిశా యువతి నమ్మి నిజమేననుకున్నది. ఈ లోగా అదే ఏడాది నవంబర్‌లో తన చెల్లికి పెళ్లి కుదిరిందని ఆ యువకుడు సొంతూరైన మంచిర్యాల జిల్లాకు వెళ్లి ఇక తిరిగిరాలేదు.
Fraud Case: ఎంతగా ఎదురుచూసినా మంచిర్యాల యువకుడు తిరిగి రాకపోవడంతో ఒడిశా యువతికి అనుమానం వచ్చింది. ఫోన్ చేసిన సరిగా రెస్పాండ్ కాకుండా ఉండేవాడు. ఓ దశలో ఇక అసలు విషయం చెప్పేశాడు. రూ.20 లక్షలు తీసుకొని మన బంధాన్ని మరిచిపోవాలని తేల్చి చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fraud Case: ప్రేమపేరుతో ఒడిశా యువతిని నమ్మించిన ఆ మంచిర్యాల యువకుడు లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అతడే లోకమని నమ్మి ఇంతదూరం వచ్చిన ఆ యువతిని నట్టేట వదిలాడు. ఆ యువతి స్వచ్ఛమైన స్నేహానికి, విలువనిచ్చిన వివాహ బంధానికి డబ్బుతో ముడిపెట్టి వదిలించుకోవాలని చూశాడు. పోలీస్ కేసులో ఇరుక్కొని కటకటాలు లెక్కించబోతున్నాడు.