Akhanda 2

Akhanda 2: అఖండ 2 కి నలుగురు ఊరమాస్ ఫైట్ మాస్టర్స్!

Akhanda 2: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ కోసం బోయపాటి స్క్రిప్ట్‌ నుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బోయపాటి సినిమాలకు ప్రత్యేకత అయిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రంలో మరో స్థాయిలో ఉండనున్నాయని సమాచారం.

ఈ మూవీ కోసం నలుగురు ప్రముఖ స్టంట్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ సోదరులు, పీటర్ హెయిన్‌తో పాటు స్టంట్ మాస్టర్ రవి వర్మ కూడా యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. వీరిలో రవి వర్మతో బోయపాటి ప్రత్యేకంగా కొత్త యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Kingdom: ‘కింగ్‌డమ్’పై విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్!

Akhanda 2: గతంలో ‘సరైనోడు’, ‘ధృవ’ చిత్రాల్లో రవి వర్మ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను అందించారు. దీంతో ‘అఖండ 2’లో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు కనులవిందు చేయనున్నాయని టాక్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *