AC Explosion: హర్యానాలోని బహదూర్‌గఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతి చెందగా.. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పేలుడు జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు తెలపడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియవు. ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కానీ పోలీస్ లు మాత్రం పేలుడు బెడ్ రూమ్ లో జరిగింది అని అనుమానిస్తున్నారు.
డీసీపీ మయాంక్ మిశ్రా మాట్లాడుతూ..
పేలుడు గ్యాస్ సిలిండర్ వాళ్ళ జరిగింది కాదు అని తెలిపారు. సిలిండర్ చెక్కుచెదరకుండా ఉంది అని అన్నారు. కానీ బెడ్ రూమ్ లో ఉన్న ఏసీ మాత్రం మొత్తం డామేజ్ అయింది అని తెలిపారు. ఏసీ వాలే పేలుడు జరిగి దాని ప్రభావం ఇల్లు మొత్తం వ్యాప్తిచెంది ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు, పేలుడు విశ్లేషణ నిపుణులను సంఘటనా స్థలానికి పంపించారు.
పేలుడు వల్ల వచ్చిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోని వచ్చారు. తర్వాత ఇంట్లో ఉన్న నాలుగు మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. గాయపడిన హరిపాల్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Delhi HC judge: హైకోర్టు జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టల వివాదం.. వీడియోలు, ఫోటోలను బయటపెట్టిన సుప్రీంకోర్ట