Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో కార్లు దగ్ధం.. రహ్మత్‌నగర్ ఎస్పీఆర్‌ హిల్స్‌లో కలకలం!

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహ్మత్‌నగర్ డివిజన్‌లో అర్ధరాత్రి వేళ పెద్ద ప్రమాదం జరిగింది. ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో పార్క్ చేసి ఉన్న నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సమీపంలోని ఇళ్ల యజమానులు తమ వాహనాలను రాత్రివేళ ఈ గ్రౌండ్‌లో పార్కింగ్ చేస్తుంటారు. ఈ దుర్ఘటనలో నాలుగు కార్లు పూర్తిగా కాలిపోగా, మరో కారు మరియు ఒక ట్రాలీ ఆటో పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున ఈ మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక ఎవరైనా దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్‌స్పెక్టర్ సురేందర్ పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వాహనాల యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *