EX-MLA Died: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది. ఆమె మృతి పట్ల పాయకరావుపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Harish Rao: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం
1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం పార్టీ తరఫున పాయకరావుపేట నుంచి పోటీ చేసి, తన తొలి ప్రయత్నంలోనే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే, ఆమె విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. 1984లో నక్కపల్లిలో బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి, ఎందరో విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆమె నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని స్థానికులు నేటికీ గుర్తు చేసుకుంటారు.
