KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

KTR: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ప‌దునైన ప్ర‌శ్న‌ల‌తో స‌వాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్ర‌శ్న‌లు గుప్పించారు. ఇప్ప‌టికే బీఆర్ఎస్ కీల‌క నేత అరెస్టు అంటూ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి స‌హా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై నిన్న ఘాటుగా స్పందించిన కేటీఆర్.. మ‌రోసారి శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు ప్ర‌శ్న‌లను సంధించారు. దేనికైనా రెడీ అన్న ఆయ‌న నువు దీనిలో దేనికైనా రెడీనా? అంటూ చేసిన ఘాటు వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారాయి.

KTRఅధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ఎస్ పార్టీల వైరం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. ఆ ప‌రంప‌ర‌లో భాగంగా కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్ర‌భుత్వంపై స్పందించారు. నా అరెస్టుకు ఉవ్విళ్లూరుతున్న రేవంత్‌రెడ్డీ.. ద‌మ్ముందా మేఘా కృష్ణారెడ్డిని సుంకిశాల ఘ‌ట‌న‌లో బ్లాక్ లిస్టు చెయ్య‌డానికి? ద‌మ్ముందా మేఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేయ‌డానికి? ద‌మ్ముందా ఆ ఆంధ్రా కాంట్రాక్ట‌ర్‌ను త‌న ఈస్టిండియా కంపెనీని కొడంగ‌ల్ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నుల నుంచి తీసివేయ‌డానికి? ద‌మ్ముందా? లేదా? సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నవా? అంటూ కేటీఆర్‌ ఘాటు ప్ర‌శ్న‌లు సంధించారు.

ఇది కూడా చదవండి: Kethireddy: వైసీపీ నేత కేతిరెడ్డికి షాక్.. చెరువు ఆక్రమణ పై నోటీసు

KTR: నేను హైద‌రాబాద్ లోనే ఉన్నాను. మీ ఏజెన్సీలు ఎప్పుడైనా రావ‌చ్చు. చాయ్, ఉస్మానియా బిస్కెట్ల‌తో స్వాగ‌తిస్తా.
మీ పుట్టిన‌రోజు కేక్ క‌ట్ చేయాల‌నుకుంటే నేనే క‌ట్ చేస్తా.. అని కేటీఆర్ మ‌రో ట్వీట్‌లో సున్నితంగా రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరారు. అదే విధంగా మేఘా కంపెనీ త‌ప్పుల‌ను ప్రశ్నించాలంటే మీకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది. ముందు తెలంగాణ గురించి ఆలోచించ‌డానికి మీకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది.. అంటూ ముఖ్య‌మంత్రిని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi Sanjay: మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *