PSR Anjaneyulu: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. రిమాండ్‌లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు పీఎస్‌ఆర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలకు దిగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే క్రమంలో ఆయన అరెస్ట్ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆరోగ్యంపై అధికార వర్గాలు త్వరలో స్పష్టమైన సమాచారం ఇవ్వనున్నారు.