Former Death:

Former Death: వ‌డ‌దెబ్బతో వ‌డ్ల కుప్ప‌పైనే ప‌డి ప్రాణాలిడిసిన రైతు

Former Death: రోజులు గ‌డుస్తున్నాయి.. వ‌డ్లు కొనే దిక్కు లేదు.. కొనుగోలు కేంద్రంలో వ‌స‌తులు లేవు.. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం.. నిర్వాహ‌కుల జాప్యం.. ఫ‌లితంగా ఓ రైత‌న్న నిండు ప్రాణం బ‌లైంది. పొద్దంతా వ‌డ్ల‌ను ఆర‌బెడుతూ ఇటీవ‌లే ఓ ప్రాణాలిడిచిన రైతు ద‌య‌నీయ స్థితిని మ‌రువ‌క ముందే మ‌రో రైతు అదే వ‌డ‌దెబ్బ‌తో వ‌డ్ల‌కుప్ప‌పై ప‌డి క‌న్నుమూశాడు.

Former Death: మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌లం పోచంప‌ల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు గుగులోతు కిష‌న్ (51) త‌న‌ వ‌డ్లు ఆర‌బోస్తుండగా వ‌డ‌దెబ్బ సోకింది. దీంతో అక‌స్మాత్తుగా స్పృహ కోల్పోయి త‌న వ‌డ్ల రాశిపైనే ప‌డి ఆ రైతు చ‌నిపోయాడు. నిబంధ‌న‌లు, వ‌డ్ల కొనుగోలులో జాప్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా ఎండ‌లో వ‌డ్ల‌ను ఆర‌బోస్తూ వ‌డ‌దెబ్బ‌కు గుర‌య్యాడు.

Former Death: ఆ కొనుగోలు కేంద్రంలో రైతులు విశ్రాంతి తీసుకోవ‌డానికి క‌నీసం టెంటు ఏర్పాటు చేయ‌లేద‌ని రైతులే చెప్తున్నారు. తాగునీటి వ‌స‌తి కూడా ఏర్పాటు చేయ‌లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఆ కార‌ణంగానే రైతు కిష‌న్ చ‌నిపోయాడ‌ని తోటి రైతులు తెలిపారు. మునుపెన్న‌డూ లేనంత‌గా కొనుగోలు కేంద్రాల‌లో ఈ ఏడాది రైతుల మ‌ర‌ణాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *