YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో ఊహించని ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. దీంతో, సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ బదిలీ ఆరోపణలు
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లను తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ జగన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం, షేర్ల బదిలీ విషయంలో ఉన్న వివాదాలు ఈ పిటిషన్ ద్వారా మరోసారి బయటపడ్డాయి.