Atishi: మాజీ ముఖ్యమంత్రి, కల్కాజీ ఎమ్మెల్యే అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో ఆమెను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు, పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికవడం ఇదే తొలిసారి.
శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన తర్వాత, అతిషి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేలా చూస్తుందని ఆమె చెప్పారు. మహిళలకు ₹2500 ఇస్తామన్న ప్రధానమంత్రి వాగ్దానాన్ని నెరవేర్చేలా బీజేపీపై ఒత్తిడి తేవడం తమ మొదటి ప్రాధాన్యతగా అతిషి చెప్పారు. ఇక ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అతిషిని కేజ్రీవాల్ అభినందించారు.
ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుండి ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతాయి. 26న శివరాత్రి కారణంగా సెలవు ఉంటుంది. తొలిరోజు ప్రోటెం స్పీకర్ అరవిందర్ సింగ్ లవ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.
Also Read: Maha Kumbh Mela: మరో రెండు రోజులు మాత్రమే.. 42వ రోజు మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తజనం
ఈ సమావేశంలోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రోహిణికి చెందిన బిజెపి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా స్పీకర్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. . మోహన్ సింగ్ బిష్ట్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించవచ్చు. శనివారం విజేంద్ర గుప్తా సీఎం రేఖ గుప్తాను కలిశారు.
ఫిబ్రవరి 25న అసెంబ్లీలో కాగ్ పెండింగ్‌లో ఉన్న 14 నివేదికలను ప్రవేశపెడతామని గుప్తా చెప్పారు. ఆప్ ప్రభుత్వ తప్పుడు మద్యం విధానం వల్ల ఢిల్లీకి రూ.2026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక పేర్కొంది.