Cars Recall: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) తమ వాహన వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ కార్లలోని ఇంజిన్ భాగంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, అమెరికా వ్యాప్తంగా సుమారు 1,19,000 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) ప్రకటించింది.
సాధారణంగా చలి దేశాల్లో ఇంజిన్ త్వరగా వేడెక్కడానికి ‘బ్లాక్ హీటర్లను’ ఉపయోగిస్తారు. అయితే, ఈ హీటర్లలో పగుళ్లు రావడం వల్ల ఇంజిన్‌కు సంబంధించిన ఆయిల్ (కూలెంట్) లీక్ అయ్యే అవకాశం ఉందని గుర్తించారు. ఇలా ఆయిల్ లీక్ అయినప్పుడు, హీటర్‌ను పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా రహదారి భద్రతా సంస్థ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Sunita Williams: స్పేస్‌లో 608 రోజులు.. సునీతా విలియమ్స్ రిటైర్మెంట్
ఈ సమస్య ప్రధానంగా 2013 నుండి 2024 మధ్య కాలంలో తయారైన ఫోర్డ్ ఫోకస్, ఎస్కేప్, ఎక్స్‌ఫ్లోరర్ మరియు లింకన్ ఎంకేసీ మోడల్ కార్లలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇలాంటి లోపం వల్ల సుమారు 12 కార్లలో మంటలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
తమ కార్లలోని ఈ లోపాన్ని ఉచితంగా సరిచేస్తామని ఫోర్డ్ స్పష్టం చేసింది. అప్పటివరకు కస్టమర్లు తమ వాహనాలను పవర్ సాకెట్లకు ప్లగ్ ఇన్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని కంపెనీ సూచించింది.
